బాలీవుడ్ పింక్ మూవీ కి రీమేక్ అయిన వకీల్ సాబ్ చిత్రంతో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత వెండి తెరపై కనిపించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తెలుగు రాష్ట్రాలలో నిన్న ఎంతో ఘనంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఈ రీమేక్ చిత్రం ఒరిజినల్ మూవీ కి ఏమాత్రం తగ్గకుండా, మూవీ సోల్ ని అందంగా ప్రెజెంట్ చేశారు దర్శకుడు వేణు శ్రీ రామ్.