కరోనా మహమ్మారి మళ్ళీ తన పంజాను విసురుతోంది. కరోనా ప్రభావం తగ్గిందనుకుని భ్రమించి సినిమా పరిశ్రమలన్నీ ఆగిపోయిన సినిమాలను పూర్తి చేసి విడుదలకు సిద్ధం అయ్యారు. ఇందులో కొన్ని సినిమాలు ఇప్పటికే విడుదల అయ్యాయి. ఇంతలోనే మరో పిడుగు లాంటి వార్త సినిమా ఇండస్ట్రీ వర్గాలను తీవ్రంగా కలచివేస్తోంది. కరోనా సెకండ్ వేవ్ పేరుతో మళ్ళీ మన ముందుకొచ్చేసింది.