సినీ పరిశ్రమలో వారసత్వం అన్నది ఎప్పటినుండో వస్తున్నదే. ప్రముఖ స్టార్లు, నటీనటులు తమ వారసులను ఇండస్ట్రీ లోకి తీసుకు రావడం సహజంగా జరిగేదే. అయితే సెలెబ్రెటీల వారసులకు సినీ తెరంగేట్రం ఈజీ గానే లభిస్తుంది. కానీ ఇక్కడ నిలదొక్కుకుని తమ కెరీర్ ను కొనసాగించాలంటే మాత్రం అంత సులభం కాదు. వీరికి సపోర్ట్ తో పాటు ఫుల్ టాలెంట్, అలాగే అదృష్టం అన్నీ కలిసి వస్తేనే కొనసాగగలరు.