తాజా పరిస్థితులను గమనిస్తే కరోనా సెకండ్ వేవ్ తో మరో సారి ప్రజలను భయకంపితులను చేస్తోంది. ఈ ప్రభావం సినిమా పరిశ్రమలపై పడుతోంది. ఇందులో ముఖ్యంగా మహారాష్ట్రలోని ముంబై నగరంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పటికే ముంబైలో కరోనా కారణంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీనితో బాలీవుడ్ పరిశ్రమ పెద్దలు షూటింగులో ఉన్న అన్ని సినిమాలను రద్దు చేసుకున్నారు.