ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖుల చర్చంతా పవర్ స్టార్ తాజా చిత్రం వకీల్ సాబ్ గురించే జరుగుతోంది. ఇంతటి కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ వకీల్ సాబ్ సినిమాకి వస్తున్న వసూళ్లు అబ్బురపరిచే విధంగా ఉన్నాయి. అభిమానం ఒక హద్దు దాటితే ఎలా ఉంటుందో మరోసారి పవన్ అభిమానులు చూపించారు. వకీల్ సాబ్ మూవీ థియేటర్లో విడుదల అయిన నాటి నుండి మంచి కలెక్షన్ లతో దూసుకుపోతోంది.