కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఆఫ్టర్ లాంగ్ టైం.. ఇప్పుడు సినీ ఇండస్ట్రీ కొత్త రంగులతో వెలిగిపోతోంది. ఇటీవలే థియేటర్లు తెరుచుకోగా వరుస పెట్టి సినిమాలను విడుదల చేస్తున్నారు మేకర్స్. అయితే ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమపై పాన్ ఇండియా స్టార్ డం ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. టాప్ హీరోలందరూ పాన్ ఇండియా మూవీ వేటలో పడుతున్నారు.