ఒక్కసారి హీరో డైరెక్టర్ కాంబినేషన్ లో సూపర్ హిట్ మూవీ వచ్చింది అంటే, ఆ తర్వాత ఆ క్రేజీ కాంబినేషన్ పై చాలా అంచనాలే ఏర్పడతాయి. ఇప్పుడు అలాంటి చర్చ ఒకటి టాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన జనతా గ్యారేజ్ మూవీ ఏ రేంజ్ లో వసూళ్ల వర్షం కురిపించి ప్రేక్షకుల మన్ననలను పొందిందో అందరికి తెలిసిందే.