తమిళ సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరోయిన్ శృతిహాసన్. ఈమె గురించి మొదటగా చెప్పుకోవాలంటే స్వయంశక్తి కి మారుపేరుగా చెప్పుకోవచ్చు. లోకనాయకుడు అయిన కమల హాసన్ తన తండ్రి అయినప్పటికీ, ఆయన పేరును పరపతిని వాడుకోకుండానే ఒక మేటి నటిగా అటు కోలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోనూ మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఈమె ఒక మల్టీ టాలెంటెడ్ నటిగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది.