స్టార్ వారసులకు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఈజీ గానే దొరుకుతుంది.. కానీ ఇక్కడ పోటీలో పరుగులు తీస్తూ నిలదొక్కుకోవడం చాలా కష్టం. నిజం చెప్పాలంటే అది వారి స్వయంకృషి, అదృష్టం పైనే ఆధారపడి ఉంటుంది. సినీ బ్యాక్ గ్రౌండ్ మాత్రమే ఉంటే సరిపోదు.. టాలెంట్ ఇక్కడ ప్రధాన అంశం. అలా తన సొంత ప్రతిభతో మెగా పవర్ స్టార్ గా ఎదిగారు రామ్ చరణ్ తేజ్.