కొన్ని సినిమాలలో అతిధి పాత్రలు ఎంతో కీలకమవుతాయి... అలాంటప్పుడు ఆ స్పెషల్ రోల్స్ చేసే స్టార్స్ భారీ మొత్తంలోనే పారితోషికాన్ని డిమాండ్ చేస్తూ ఉంటారు.... వారు ఆ పాత్రలు చేయడం సినిమాలో ఎంతో కీలకం కావడం చేత నిర్మాతలు సైతం వారు అడిగినంత ముట్ట చెబుతుంటారు. కానీ కొందరు తారలు మాత్రం స్నేహితుల సినిమాలలో అతిధి పాత్రలు చేసేటప్పుడు... పారితోషకాన్ని ఆశించరు.