తెలుగు సినీ పరిశ్రమలో ఆనాటి మేటి దర్శకుల తరువాత హాస్యాన్ని తెరపై చక్కగా ప్రెజెంట్ చేయగలిగిన అతి కొద్ది మందిలో శ్రీను వైట్ల ముందు వరుసలో ఉంటాడు. సినిమా కథ ఏదైనా ఖచ్చితంగా హాస్యానికి పెద్ద పీట వేస్తాడు. కానీ ప్రస్తుతం శ్రీను వైట్ల కి గడ్డు కాలం నడుస్తోంది. ఈయన వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. కానీ ఒకప్పుడు వరుస హిట్ సినిమాలను అందించిన ఘనత ఈయనదే.