సినీ స్టార్స్ అంటే... రెండు చేతులా సంపాదన అనే చెప్పాలి. ఒకసారి స్టార్ రేంజ్ కి చేరారంటే ఇక వారి దశ తిరిగినట్టే. ఓ వైపు వరుస అవకాశాలు వెతుక్కుని వస్తాయి.. మరోవైపు బ్రాండ్ అంబాసిడర్ ల గానూ, ప్రముఖ పారిశ్రామిక సంస్థలకు యాడ్స్ చేసేందుకు గానూ, ఇంకా వీలైతే షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి.... ఇలా అనేక రకాల ఆఫర్లు ఆ స్టార్స్ ను చుట్టుముడతాయి. ఇలా ఎటు చూసినా కాసుల వర్షమే మరి.