సినీ పరిశ్రమలోకి స్టార్స్ వారసులు రావడం ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయమే. అదే ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీకి మరో సెలబ్రిటీ వారసుడు హీరోగా పరిచయం కానున్నాడు. ఆ కాబోయే కథానాయకుడి పేరు ఆకాష్ మురళి. దివంగత తమిళ నటుడు మురళి రెండవ కుమారుడే ఈ ఆకాష్ మురళి. మొదటి కొడుకు అధర్వ మురళి కాగా ఆకాష్ చిన్నవాడు. అథర్వ తెలుగు ప్రేక్షకులకు పరిచయస్తుడే.