ఖైదీ నెంబర్ 150 సినిమా తో బాస్ ఈజ్ బ్యాక్ అంటూ సినీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ ఇక అప్పటినుండి తన స్పీడును పెంచారు. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీరిక లేకుండా షూటింగ్ లతో బిజీ అయిపోయారు. ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో హీరోగా నటిస్తున్నారు చిరు. అయితే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయినట్లు సమాచారం.