సన్నీలియోన్ కి బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఈమె ప్రస్తుతం అక్కడ పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. ఈమె హీరోయిన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ పలు సినిమాలలో నటిస్తోంది. అయితే ఈమె స్టార్ డం ని మన తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం చేయడానికి మన నిర్మాతలు ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్నారు. సౌత్ లోని అన్ని భాషల్లో ఒక సినిమా ఇప్పటికే షూటింగు దశలో ఉంది.