లోకనాయకుడు కమల్ హాసన్, సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం భారతీయుడు ఎంతటి విజయం సాధించి పెను సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. 1996లో విడుదలైన ‘భారతీయుడు’ చిత్రం అప్పట్లో ఓ ప్రభంజనం. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 2 తీయాలని సంకల్పించారు డైరెక్టర్ శంకర్. అందుకు కమల్ హాసన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.