మన తెలుగు ఇండస్ట్రీ లోనే కాక... ఇతర సినీ పరిశ్రమలోనూ కాస్టింగ్ కౌచ్ అనే వివాదం చెలరేగుతూనే ఉంది. ఇప్పటికే ఎంతో మంది సినీ నటులు ఫిల్మ్ ఇండస్ట్రీలో అమ్మాయిలకు జరుగుతున్న అన్యాయాలపై, అదే విధంగా తాము ఎదుర్కొన్న సమస్యాత్మక అనుభవాల గురించి పెదవి విప్పారు. వీరిలో కొందరు స్టార్ హీరోయిన్లు కూడా ఉండడం ఆశ్చర్యకరమైన విషయం.