ఇటీవలే సింగర్ సునీత తన మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్ళి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పెళ్ళిలో ఆమె పిల్లలే దగ్గరుండి అన్ని వ్యవహారాలను చూసుకున్నారు. రెండో పెళ్లి మాట పక్కన పెడితే పిల్లలు తన తల్లికి కొత్త జీవితాన్ని అందించాలని చూపించిన చొరవ అందరి మనసును తాకింది.