ఊర మాస్ దర్శకుడు బోయపాటి శీను, నందమూరి బాలకృష్ణ అనగానే సక్సెస్ ఫుల్ కాంబో అని టక్కున చెప్పేస్తారు. అంతగా వీరి కాంబినేషన్ కు గుర్తింపు దక్కింది. వీరి కాంబోలో సింహా ,లెజెండ్ వంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కగా... ఇప్పుడు హ్యాట్రిక్ తో వస్తున్న సినిమా "అఖండ". ద్వారకా క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇక థమన్ ఈ మూవీకి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.