ఈ సంవత్సరం విడుదలయిన అన్ని సినిమాలలో ప్రేక్షకులు మెచ్చిన చిత్రంగా నిలిచింది జాతిరత్నాలు. ఈ సినిమాలో నటించిన ఒక్కో పాత్రకు మంచి ఆదరణ లభించింది. రీసెంటుగా ఈ సినిమాకు సంబంధించిన కలెక్షన్ వివరాలను సినీ నిర్మాతలు ప్రకటించారు. దాదాపుగా 35 కోట్ల వరకు లాభాలు తెచ్చిపెట్టినట్లు తెలిసింది. ఈ చిత్రం ఆధ్యంతం కామెడీ ప్రధానంగా సాగుతుంది.