ప్రస్తుతం దేశంలో కరోనా విలయం సృష్టిస్తోంది. రోజు రోజుకు రెట్టింపవుతున్న కేసులు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. అతి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చేసింది అంటూ ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో వైపు మరణాల సంఖ్య కూడా పెరుగుతూ ఉండడంతో ప్రమాద స్థాయి ఏ మోతాదులో ఉందో అందరికీ అర్థమవుతోంది.