కరోనా పుణ్యమా అని థియేటర్లను మూసివేయడంతో ఎంటర్ టైన్మెంట్ రంగం సరికొత్త దారులను వెతుక్కుంది. ఇలా పుట్టినవే ఓ టి టి ప్రసార మాధ్యమాలు. ఇవి వచ్చిన తరువాత వెబ్ సిరీస్ లు ఎక్కువగా వస్తున్నాయి. కొత్త కాన్సెప్ట్ లను ఎంచుకుని సినిమాలకు మించి తెరకెక్కిస్తున్నారు. దీనితో ప్రస్తుతం భారతదేశంలో వెబ్ సిరీస్ ల హవా కొనసాగుతోంది. ఈ వెబ్ సిరీస్ ల ద్వారా ఎంతోమంది ప్రతిభ ఉన్న నటీనటులు వెలుగులోకి వస్తున్నారు.