"తుజే మేరి కసం" అనే హిందీ చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన జెనీలియా... తెలుగులో సత్యం చిత్రంతో తెరంగ్రేటం చేసింది. క్యూట్ నవ్వుతో, మత్తెక్కించే కళ్ళతో ప్రేక్షకుల మనసును కొల్ల గొట్టిన ఈ ముంబై భామ... బొమ్మరిల్లు చిత్రంతో యువత పెదవులపై మెరిసే హాసినిగా మారిపోయింది. ఈ చిత్రంతో ఆమె ఒక్కసారిగా టాప్ హీరోయిన్ గా మారిపోయింది.