ఎంతోమందికి నటులు కావాలని కోరిక ఉంటుంది. కానీ కుటుంబం నుండి సరైన ప్రోత్సాహం లేక వారి కల కలలాగా మిగిలిపోతుంది. మరి కొంతమందికి కుటుంబం నుండి సపోర్ట్ ఉంటుంది. కానీ నటనారంగంలో నిలబడలేక వెనుదిరుగుతూ ఉంటారు. కానీ కొంతమంది ఎటువంటి సహకారం లేకుండా, సినిమా రంగంలో తెలిసిన వారు ఎవరూ లేకపోయినా స్వయం శక్తితో నటిగా మారి ఎన్నో విజయాలను సాధిస్తూ ఉంటారు.