మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ నటిస్తున్న తాజా చిత్రం "సూపర్ మచ్చి" ఈ సినిమాకి పులి వాసు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రిజ్వాన్, ఖుషి కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి.