మెగాస్టార్ చిరంజీవి వారసుడు రామ్ చరణ్ తేజ్ చిరుత సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఇప్పుడు నెంబర్ వన్ హీరోగా దూసుకు పోతున్నాడు. పేరుకి స్టార్ కిడ్ ఇమేజ్ తో ఎంట్రీ ఇచ్చినా తన ప్రతిభతో సత్తా చాటాడు చెర్రీ. అయితే ఇప్పుడు చిరు పెద్ద కుమార్తె సుస్మిత కూడా సినీ రంగ ప్రవేశం చేయబోతున్నట్లు తెలుస్తోంది.