ప్రముఖ తమిళ హాస్య నటుడు వివేక్ కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. వివేక్ మరణంతో అటు తమిళ పరిశ్రమ ఇటు తెలుగు పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అయితే ఈ సందర్భంలో వివేక్ సహనటుడు మన్సూర్ ఖాన్ అతని మరణంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వివేక్ టీకా వేసుకున్న కొద్ది రోజుల అనంతరం అస్వస్థకు గురయిన విషయం వాస్తవమే.