స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప. ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో యాక్షన్ డ్రాప్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ఇది. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్గా కనిపించనున్నారు. ఈ సినిమా ఆగస్టు 13న రిలీజ్ చేస్తామని ప్రకటించింది చిత్ర బృందం.