జాన్వీ కపూర్ పేరుకు బాలీవుడ్ నటి అయినా, మన అతిలోక సుందరి అందాల నటి శ్రీదేవి తనయురాలుగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. ఇప్పటికే ఈమె బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. 'ధడక్' అనే సినిమాతో హిందీ ప్రేక్షకులకు పరిచయమైన ఈమె ప్రస్తుతం పలు హిందీ చిత్రాలతో బిజీగా ఉంది.