అవికా గోర్ సినీ కెరీర్ ను బాగానే ఆరంభించినా ఆ తరువాత ఏదీ చెప్పుకోదగ్గ విజయాన్ని అందించలేదు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో తన జోరు చూపించడానికి రెడీ అవుతోంది. చిన్నారి పెళ్లికూతురు టీవీ సీరియల్తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ భామ, ఉయ్యాల జంపాల చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది.