నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాలలోనూ దూసుకుపోతున్నారు. కానీ సినీ దర్శకురాలు అంటే మాత్రం , బాబోయ్ లేడీ డైరెక్టరా ఈమెం చేస్తోంది అన్న భావన చాలామందిలో ఉంది. అలాంటి ముద్రను చెరిపి తన సత్తా చాటుకుంది సుధ కొంగర. అయితే ఈమెకు అంత సులువుగా ఏమి అవకాశాలు దొరకలేదు. దర్శకురాలిగా మారడానికి ఎంతో కృషి చేసింది సుధ.