ప్రపంచంపై పగబట్టిన కరోనా రోజురోజుకు శృతిమించుతోంది. కేసులు లక్షల్లో నమోదవుతూ ప్రజానీకాన్ని భయపెడుతున్నాయి. పలు రాష్ట్రాలు ఇప్పటికే కర్ఫ్యూ అమలుచేశారు. తాజాగా ఏపీ కూడా మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ విధించింది. మరోవైపు దేశాన్ని ముంచెత్తుతున్న కరోనా ఎవరినీ వదలడం లేదు. దీని వేగానికి బ్రేకులు వేసేందుకే పలు ప్రభుత్వాలు రంగంలోకి దిగి కర్ఫ్యూ బాట పట్టారు.