దేశం కరోనా సంక్షోభంతో అల్లాడిపోతోంది. బెడ్స్ దొరక్క, ఆక్సిజన్ అందక మన వాళ్ళని కళ్లముందే కోల్పోతున్నాం. కాపాడండి అని మన వాళ్ళు అడిగే చివరి మాట విని ఏమి చేయలేని పరిస్థితులలో కృంగిపోతున్నాం. ఇలాంటి సమయంలో మరో వైపు రాజకీయనాయకులు, కొందరు ప్రైవేటు హాస్పిటల్ ల వ్యవహారశైలిపై మండిపడ్డారు ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్.