నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కీర్తి సురేష్. చూడడానికి అచ్చం తెలుగమ్మాయిలా కనిపించే ఈ ముద్దుగుమ్మ వాస్తవానికి మలయాళీ కుట్టి. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని తన టాలెంట్ కనబరిచింది. ఈ చిత్రం ఆమె సినీ జీవితంలో ఒక కీలక మలుపు, తన క్రేజ్ ను అమాంతం పెంచేసిన గెలుపు.