అడవి శేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అందరిలాగే తెలుగు సినీ పరిశ్రమలోకి వచ్చినా ఎవ్వరూ ఊహించలేనంతగా ఎదిగిపోయాడని చెప్పాలి. ఈ నటుడు తొలి సినిమాతోనే తన స్టామినా ఏమిటో నిరూపించుకున్నాడు. ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా పంజాలో చేసిన పాత్రతో మరింత గుర్తింపును సొంతం చేసుకున్నాడు.