తెలుగు సినీ ప్రేక్షకులకు అత్యంత సన్నిహితుడు, ఆప్త మిత్రుడు ఆచార్య ఆత్రేయ. వాస్తవానికి ఈయన పూర్తి పేరు కిళాంబి వెంకట నరసింహాచార్యులు. ఈ రోజు ఆత్రేయ గారి శతదినోత్సవాన్ని పురస్కరించుకుని ఒకసారి ఆయన మహోన్నతమైన కళను గుర్తుచేసుకుందాం. ఆత్రేయ కవిగా, రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా, ఇలా తనలోని పలు కళలను రంగరించి ప్రేక్షకులకు కనువిందు చేసి, తెలుగు సినీ పరిశ్రమకు అంకితం చేసిన మహానుభావుడు ఆత్రేయ.