సినిమా అంటేనే ఒక ఉల్లాసం... ఒక ఉత్సాహం...మనసులోని బాధను తీసేసి ఒక సంతోషాన్ని నింపే ఇంధనం. సినిమాలే లేకపోతే ఎంతోమంది తమ తమ జీవితాలను కోల్పోయే వారు. ఎన్ని బాధలున్నా ఒక్క కామెడీ సినిమా చూస్తే ఆ బాధలన్నీ మటుమాయం అయిపోతాయి. అంత మహత్యం ఉంది సినిమాలలో. ఒక సినిమాను 2.30 గంటలపాటు చూడడమంటే మాములు విషయం కాదు.