సాయిపల్లవి తెలుగు సినీ ప్రేక్షకులకు దక్కిన ఓ ఆణిముత్యం. హీరోయిన్ అంటే సినిమాకి గ్లామర్ అనుకునే ఈ రోజుల్లో స్కిన్ షో చేయకపోయినా తమ టాలెంట్ తో టాప్ హీరోయిన్ గా కొనసాగొచ్చని ప్రూవ్ చేసిన అతి కొద్దిమంది కథానాయికలలో ఈమె కూడా ఒకరు. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఇప్పుడు టాప్ హీరోయిన్ గా రాణిస్తోందంటే అది సాధారణమైన విషయం కాదు.