మన భారతదేశం ఇంతలా ఇబ్బంది పడే రోజు వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. అయితే చైనా నుండి ఊడిపడిన ఈ కరోనా మహమ్మారి కారణంగా మన పరిస్థితి దినదినగండంగా మారింది. కరోనా ఎటువైపు నుండి ఎప్పుడు ఎలా వస్తుందో అర్ధం కాని పరిస్థితులను సృష్టించింది. ప్రతి ఒక్కరూ దీని గురించి ఆలోచించని క్షణం లేదంటే నమ్మండి. అయితే గత వారం రోజుల నుండి దేశంలో కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది.