దాదాపుగా పది మంది దర్శకుల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన నైపుణ్యాన్ని పొందిన వీరభద్ర చౌదరి అహ నా పెళ్ళంట సినిమా తో డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. అల్లరి నరేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత పూలరంగడు సినిమా కు దర్శకత్వం వహించారు వీరభద్ర.