2012 జూలై 6 న ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈగ మూవీ ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఎన్నో సినిమాలు బ్లాక్ బాస్టర్ సాధిస్తాయి, మరెన్నో సినిమాలు హిట్ ను అందుకుంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రమే ఎన్నేళ్లు గడిచినా మరవలేని తీపి జ్ఞాపకాలుగా ప్రేక్షకుల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకుంటాయి.