ఒక సినిమాను హిట్, సూపర్ హిట్ చేయడం అంటే అంత చిన్న విషయం కాదు. దాని వెనుక ఎంతో మంది సినీ కార్మికుల శ్రమ దాగి ఉంటుంది. ముఖ్యంగా డైరెక్టర్ యొక్క పనితనం సినిమా ఫలితాన్ని డిసైడ్ చేస్తుంది. అంతటి గొప్ప ప్రతిభ కలిగిన దర్శకుడిగా గుర్తింపు పొందారు తమిళ దర్శకుడు అట్లీ. షార్ట్ ఫిల్మ్స్ తెరకెక్కించి, దర్శకుడిగా మారిన అతి తక్కువ మందిలో అట్లీ కూడా ఒకరు కావడం విశేషం.