టాలీవుడ్ సినీ పరిశ్రమ స్థాయిని పెంచిన దర్శకులలో కోవెలమూడి రాఘవేంద్రరావు ఒకరు. డైరెక్షన్ లో కొత్తదనం, అటు గ్లామర్, ఇటు ఆధ్యాత్మిక చిత్రాలను తీయడంలో దిట్ట. కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈయన ఎంతోమంది నటీనటులకు సినీ జీవితాన్ని అందించిన దర్శక దేవుడు. ఆయన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ లు, మరెన్నో సూపర్ హిట్స్.