హీరో అనగానే మంచి హైట్, సూపర్ ఫిజిక్ ఉండాలి అనుకునే ఆ రోజుల్లో ఎంతో మంది అగ్ర కథానాయకులను దాటుకుని హీరోగా తెలుగు సినీ పరిశ్రమలో నిలదొక్కుకున్నారు చంద్రమోహన్. తన సహజమైన నటనతో ప్రేక్షకులను మెప్పించి నటుడిగా సుదీర్ఘమైన ప్రస్థానం కొనసాగించారు. తెలుగు చలన చిత్రసీమలో ఎన్నో విలక్షణమైన పాత్రలను పోషించి తనకంటూ గొప్ప గుర్తింపు పొందారు.