నాగార్జున వంటి సీనియర్ హీరోలు సొంత బ్యానర్ పై సినిమాలు చేయడం తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో యంగ్ హీరోలు సైతం నిర్మాతలుగా మారిపోతున్నారు. సొంత బ్యానర్ పై సినిమాలు తీస్తూ పారితోషికానికి మించిన లాభాలను ఆర్జిస్తున్నారు. తమ సోదరుల సన్నిహితుల బ్యానర్లను కూడా ప్రోత్సహిస్తూ సినిమాలు చేస్తున్నారు.