కేరళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడిగా వెండి తెరపై ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సల్మాన్ తన ప్రతిభతో అనతి కాలంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న ఈ మలయాళ హీరో ఓకే బంగారం, కనులుకనులను దోచాయంటే వంటి పలు డబ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసునుకు దగ్గరయ్యాడు.