సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ దొరకాలంటే చిన్న విషయం ఏమీ కాదు. అందులోనూ స్టార్ హీరో, హీరోయిన్ గా రాణించాలంటే రాసిపెట్టి ఉండాలి అంటారు. ఇక్కడ నట వారసులకు ప్రోత్సాహం ఎక్కువ అన్నది అందరికీ తెలిసిన రహస్యమే. దీనినే నెపోటిజం అంటారని సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తెలిసిన తరువాత కానీ అందరికీ తెలియలేదు.