టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరు మరియు మెగా స్టార్ వారసుడు రామ్ చరణ్ తేజ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. ఈ చిత్రంలో తండ్రి, తనయులు అటు చిరు ఇటు చెర్రీ ఇద్దరు ఒకే తెరపై ఎక్కువ నిడివితో కనబడబోతుండడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి.