సినీ పరిశ్రమలో అమితాబ్ బచ్చన్ తెలియని వారు ఉండరనే చెప్పాలి. బాలీవుడ్ బిగ్ బి గా పేరున్న అమితాబ్ బచ్చన్ ఈ రోజు తన 48 వ పెళ్లి రోజును తన భార్య జయా బచ్చన్ తో జరుపుకుంటున్నారు. ఈ మంచి రోజును పురస్కరించుకుని అమితాబ్ తన పెళ్లి రోజు ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.