దగ్గుబాటి కుటుంబానికి చెందిన రానా గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పటికే తెలుగు సినిమా పరిశ్రమలో తన ప్రతిభను నిరూపించుకుని ఎటువంటి పాత్రనైనా చేయడానికి రెఢీ అంటున్నాడు. రానా సినిమా జీవితం బాహుబలి తర్వాత చాలా మారిపోయింది. బాహుబలిలో తన పాత్రకు 100 శాతం న్యాయం చేసి ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యాడు.